Andhra Pradesh: ఇంత దారుణమా.. మూడేళ్ల చిన్నారి గొంతు కోసి చంపేసిన మేనమామ, తల్లి పక్కనే నిద్రిస్తూ తిరిగిరాని లోకాలకు చిన్నారి, పరారీలో నిందితుడు, విజయనగరం జిల్లాలో దారుణ ఘటన

సొంత మేనమామ చేతిలో మూడేళ్ల చిన్నారి దారుణ హత్యకు (Youngster Kills 3-Year-Old Niece) గురైంది. తల్లి పక్కనే నిద్రిస్తున్నచిన్నారి గొంతు కోసి ఆ కసాయి ప్రాణాలు తీశాడు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Amaravati, June 13: విజయ నగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సొంత మేనమామ చేతిలో మూడేళ్ల చిన్నారి దారుణ హత్యకు (Youngster Kills 3-Year-Old Niece) గురైంది. తల్లి పక్కనే నిద్రిస్తున్నచిన్నారి గొంతు కోసి ఆ కసాయి ప్రాణాలు తీశాడు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. పెంగవ గ్రామానికి చెందిన కిల్లక పార్వతి తన మూడేళ్ల కూతురు భవ్యశ్రీతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. శుక్రవారం రాత్రి ఎప్పటిలానే చిన్నారితో కలిసి నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన సొంత చిన్నాన్న కుమారుడు వినోద్‌.. రాత్రి 11 గంటల సమయంలో టార్చిలైట్‌ సాయంతో వారి వద్దకు వెళ్లి తల్లి పక్కనే పడుకున్న భవ్యశ్రీ మెడను కత్తితో కోశాడు. భవ్యశ్రీ గిలగిలా కొట్టుకోవడంతో పార్వతికి మెలకువ వచ్చి చూసేసరికి వినోద్‌ పారిపోయాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్న చిన్నారిని చూసి తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచింది.

పేషెంట్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓ వ్యక్తి, అనంతరం పరార్, చిన్నపాటి గొడవే కారణం, మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా ఆసుపత్రిలో దారుణ ఘటన, ఐసీయూలో బాధితుడు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. పార్వతిని భర్త వదిలేయడంతో అతని మీద కోపం పెంచుకున్న వినోద్‌ ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వినోద్‌కు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.



సంబంధిత వార్తలు

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif