AP Cabinet Meeting: అవ్వాతాతలకు సీఎం జగన్ గుడ్ న్యూస్, వచ్చే నెల నుంచి పెన్షన్‌ను రూ.2750కి పెంచుతూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం, జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మంగళవారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావే­శ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.

AP CM YS Jagan (Photo-Twitter)

VJY, Dec 13: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. మంగళవారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్‌ సమావే­శ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది.

ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెన్షన్‌ పెంపుపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది.

చిత్తూరుజిల్లాలో అమరరాజా గ్రూపు కొత్త ప్లాంట్, 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపిన మంగళం ఇండస్ట్రీస్‌

జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు కానుంది.మరొకవైపు వైఎస్సార్‌ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్‌ క్లాస్‌లు, ఫౌండేషన్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీ రూమ్‌లను నాడు-నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదన​కు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement