AP Local Body Election Schedule: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. ఓటింగ్, ఫలితాల తేదీలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పుణేఠా బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమగ్ర ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు.
AP Local Body Election Schedule: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పుణేఠా బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమగ్ర ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు.
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు గ్రామ పంచాయతీలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చిందని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఏపీలో 106 మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని అంటే..
అర్బన్ లోకల్ బాడీస్ (ULB) విభాగం కింద మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు. ఇందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు , 10 నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ పట్టణ పోరుకు సంబంధించి అక్టోబర్ 18 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా, అక్టోబర్ 21ని నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. అనంతరం అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
రెండో విడత కింద గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాల భర్తీకి అక్టోబర్ 19న నోటిఫికేషన్ విడుదల కానుండగా, అక్టోబర్ 23 వరకు నామినేషన్లను స్వీకరించి, అక్టోబర్ 27 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నవంబర్ 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ పూర్తి చేసి, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇక అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత , డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ నిర్వహించి, ఆయా రోజుల్లో పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుల్లో నెలకొన్న న్యాయపరమైన సంక్లిష్టతలు తొలగిపోవడం, ప్రభుత్వం జీవోల ద్వారా రిజర్వేషన్ల ఖరారు గెజిట్ను విడుదల చేయడంతో ఈ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలైన కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షాలు తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.