COVID19 Status in AP: ఆరోగ్య సమస్యలు లేని ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారుల పిలుపు, ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఆరోగ్య సమస్యలు లేని హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకాలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,876 మంది శాంపుల్స్ ను పరీక్షించగా....

COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, February 5: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఆరోగ్య సమస్యలు లేని హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకాలు  వేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మార్చి నుంచి 50 ఏళ్లు నిండిన వృద్ధులకు వ్యాక్సినేషన్ చేపడతామని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,876 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 97 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,88,275కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,85,380గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి 25 కేసులు రాగా,  కృష్ణా జిల్లా నుంచి 11, మరియు విశాఖ జిల్లాల నుంచి 10 చొప్పున కేసులు నమోదయ్యాయి, జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో  కృష్ణా జిల్లాలో మరొక కోవిడ్ మరణం సంభవించింది, దీంతో  ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7158కి పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 179 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,80,046 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,071 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement