Huge Rush in Tirumala: టైమ్‌ స్లాట్ టోకెన్లు ఉంటేనే తిరుమలకు రండి! వరుస సెలవులతో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు, సర్వదర్శనానికి 30 గంటల టైమ్

తిరుమలలో (TTD Rush) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు (Tirumala) భక్తులు పోటెత్తారు. దీంతో శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టమెంట్‌లు నిండిపోయి ఔటర్‌ రింగ్‌రోడ్డు, శిలా తోరణం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి.

Tirumala (Credits: Twitter)

Tirumala, April 08: తిరుమలలో (TTD Rush) భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుంచి తిరుమలకు (Tirumala) భక్తులు పోటెత్తారు. దీంతో శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని (Vaikuntam Q complex) అన్ని కంపార్టమెంట్‌లు నిండిపోయి ఔటర్‌ రింగ్‌రోడ్డు, శిలా తోరణం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతో పాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు తాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు, ఆరోగ్య, విజిలెన్స్‌ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో సేవలందిస్తున్నాయి.

Chandrababu Selfie Challenge: సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరిన చంద్రబాబు, టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ ఫోటో దిగి సవాల్ విసిరిన టీడీపీ అధినేత 

వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో శనివారం మధ్యాహ్నానికి దాదాపు 79వేల మందికి అన్నప్రసాదం అందించగా.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ క్యూలైన్లలో 80వేల మందికి పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించారు. పిల్లలకు ఎప్పటికప్పుడు పాలు అందిస్తున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు.

COVID in India: భారీగా పెరుగుతున్న కేసులు, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, కొత్తగా 6050 మందికి కరోనా పాజిటివ్‌ 

శనివారం సాయంత్రం 5గంటల వరకు దాదాపు 50వేల మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలు, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement