Husband Harassment: కట్టుకున్న భార్యను సొంత అన్నతో శృంగారం చేయమని బలవంతం పెడుతున్న భర్త, ప్రోత్సహిస్తున్న అత్తామామలు, ఓ అభాగ్యురాలి వేదన..

ఎన్నో ఆశలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి భర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఏ భార్య వినకూడని మాట భర్త నోటి నుంచి వచ్చింది. చివరకు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన దుస్థితి తెచ్చాడా మృగాడు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి భర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఏ భార్య వినకూడని మాట భర్త నోటి నుంచి వచ్చింది. చివరకు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన దుస్థితి తెచ్చాడా మృగాడు.

అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త దారిలోనే భార్య నడుస్తుంది. తన భర్తే సర్వస్వం అని భావిస్తుంటుంది. భర్తను కాదని పరాయి వాళ్ల గురించి కలలో కూడా ఆలోచించదు. అలా ఎన్నో ఆశలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువతికి భర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఏ భార్య వినకూడని మాట భర్త నోటి నుంచి వచ్చింది. చివరకు ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన దుస్థితి తెచ్చాడా మృగాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కి చెందిన వ్యక్తికి 2020 మార్చి 5వ తేదీన ఓ యువతితో పెళ్లైంది. పెళ్లిన కొత్తలో బాగానే ఉన్న పోలయ్యకు కొన్నాళ్లకే భార్యపై అనుమానపు జబ్బు మొదలైంది. భార్యకు ఎవరితోనో సంబంధం ఉందంటూ నిత్యం వేధిస్తూ కొడుతూ ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడు. ఐతే భర్త పెట్టే చిత్రహింసలు మౌనంగా భరిస్తున్న ఆమెకు.. కట్టుకున్న వాడి నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఏ భర్త.. భార్యతో చెప్పని విధంగా తన అన్నతో గడపాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ

నిత్యం అలాగే ఒత్తిడి తెస్తుండటంతో భరించలేక విషయాన్ని అత్తమామలతో చెప్పింది. కొడుకును మందలించాల్సిన వారు కోడలిపైనే కక్షగట్టి వేధించడం మొదలుపెట్టారు. ఒకరికి ముగ్గురు తోడై శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఇటీవల అత్తింటి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. భర్త నిత్యం వికృతంగా ప్రవర్తిస్తుండటంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీతో మీ ఎస్పీ-స్పందన పేరుతో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిన బాధిత యువతి.. తన భర్త, అత్తమామల చిత్రహింసల గురించి చెప్పి బోరున విలపించింది.

అలాంటి వాడితో ఇక బ్రతకలేనని తనకు విడాకులు ఇప్పించి ఆ నరకం నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంది. వెంటనే స్పందించిన ఎస్పీ.. ఆమెను వేధిస్తున్న భర్త, అత్తమామలపై కేసు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement