Chittoor Shocker: తన కంటే వయస్సులో చిన్నవాడైన పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ, బోర్ కొట్టి వదలియేడంతో, కుర్రాడు రెచ్చిపోయి ఏం చేశాడో తెలిస్తే...

క్షణిక సుఖం కోసం పండంటి జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. భర్త లేని లోటును తనతో పనిచేసే వ్యక్తితో పంచుకోవాలని చూసింది మహిళ. పనిచేసే చోట పరిచయమైన వ్యక్తితో ఏర్పడిన చనువు సంబంధానికి దారితీసింది.

extramarital affair | Image Used For Representational Purpose Only

మదన పల్లి, మార్చి 26: క్షణిక సుఖం కోసం పండంటి జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. భర్త లేని లోటును తనతో పనిచేసే వ్యక్తితో పంచుకోవాలని చూసింది మహిళ. పనిచేసే చోట పరిచయమైన వ్యక్తితో ఏర్పడిన చనువు సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ప్రియురాలు చెప్పిమాటతో అతడి కోపం నషాలానికి అంటింది. కక్షతో రగిలిపోయి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్  లోని చిత్తూరు జిల్లా  మదనపల్లె మండలం కట్టుబావి గ్రామానికి చెందిన గంగాధర్ కు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు.

ప్రతిరోజూ కూలి పనులకు వెళ్లివచ్చే సందర్భంలో చంద్రమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. చంద్రమ్మ భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్య కారణంతో చనిపోవడంతో ఇద్దరు మరింత చనువుగా ఉండేవాళ్ళు. ఆ చనువు కాస్తా కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన కంటే వయస్సులో చిన్నవాడైన గంగాధర్ తో సాఫీగా ఏడేళ్లపాటు సంబంధాన్ని కొనసాగించింది చంద్రమ్మ. ఐతే తన ఇద్దరు కుమార్తెలు పెరిగి పెద్దవుతుండటంతో అక్రమ సంబంధం గురించి వారికి తెలిస్తే సమస్య అవుతుందని భావించిన చంద్రమ్మ.. గంగాధర్ ను దూరం పెట్టింది.

RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ

ఇదే విషయంపై చంద్రమ్మ, గంగాధర్ గొడవ పడేవారు. అయితే చంద్రమ్మ మాటలు ఏమాత్రం పట్టించుకోని గంగాధర్ చంద్రమ్మను వేధింపులకు గురి చేసేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక గంగాధర్ వెళ్లే ప్రాంతంలో కూలీ పనులు వెళ్లడం కూడా మానేసింది. దీంతో గంగాధర్ చంద్రమ్మను నిలదీశాడు. ఇకపై ఎలాంటి సంబంధం లేదని చంద్రమ్మ తేల్చి చెప్పడంతో కోపంతో ఊగి పోయిన గంగాధర్.., గంగమ్మ గుడి వద్ద అందరూ చూస్తుండంగానే చంద్రమ్మతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ప్రక్కనే ఉన్న కొడవలితో ఆమె మెడపై గొంతును నరికాడు. దీంతో చంద్రమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న చంద్రమ్మను స్ధానికులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్ధానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గంగాధర్ కోసం గాలిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement