COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 3 లక్షల 82 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 3500 దాటిన కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. నిన్న బుధవారం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో సుమారు 11 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదయ్యాయి. హెల్త్ బులెటిన్ ప్రకారం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ....

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, August 27:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. నిన్న బుధవారం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో సుమారు 11 వేలకు చేరువగా  కొత్త కేసులు నమోదయ్యాయి.  హెల్త్ బులెటిన్ ప్రకారం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,830 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,82,469 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,79,574 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1528 కేసులు నమోదయ్యాయి.

పశ్చిమ గోదావరి, నెల్లూరు మరియు విశాఖపట్నం  జిల్లాల్లో కూడా వెయ్యికి పైగానే పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Report:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

నిన్నటివరకు  మరో 81 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 3,541 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి వరకు మరో 8,473 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 2,86,720 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 92,208 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  61,838 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు సుమారుగా  34,18,690 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement