COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,073 పాజిటివ్ కేసులు నమోదు, 8,695 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 67,683గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

గడిచిన ఒక్కరోజులో మరో 48 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,606కు పెరిగింది....

Coronavirus in AP (Photo Credits: IANS)

Amaravati, September 25: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ కేసులు ఒకరోజు పెరుగుతూ, మరో రోజు తగ్గుతూ ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్రంలో వైరస్ విజృంభన ఇప్పటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మరియు తమిళనాడుకు సమీపంలో ఉండే జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 7,073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 6,61,458 కు చేరింది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 6,58,567 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతోంది.  ఈ రెండు జిల్లాల నుంచే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1031 కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 931 పాజిటివ్ కేసులునమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో  48 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,606కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 8,695 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 5,88,169 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 67,683 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  69,429 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు రాష్ట్రంలో 54,47,796 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement