Vijayawada Horror: విజయవాడలో దారుణం.. ప్రియురాలిపై కొడవలితో దాడి చేసి, భవనం పైనుంచి దూకి ప్రియుడి ఆత్మహత్య..

విజయవాడ నగరంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారంలో పెరిగిన అనుమానం ఒక యువతి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా, యువకుడి ఘోర ఆత్మహత్యకు దారితీసింది. న్యూ రాజరాజేశ్వరి పేటలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Murder | Representational Image (Photo Credits: File Photo)

Vijayawada Horror: విజయవాడ నగరంలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారంలో పెరిగిన అనుమానం ఒక యువతి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా, యువకుడి ఘోర ఆత్మహత్యకు దారితీసింది. న్యూ రాజరాజేశ్వరి పేటలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... న్యూ రాజరాజేశ్వరి పేటకు చెందిన మహాలక్ష్మి అనే యువతి, చిన్నారావు అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మహాలక్ష్మి ప్రవర్తనపై చిన్నారావు తీవ్ర అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం అనుమానంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చిన్నారావు.. మహాలక్ష్మిపై కొడవలితో ఒక్కసారిగా దాడికి దిగాడు. తీవ్రంగా గాయపరుస్తూ ఆమె గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. .  తిరుపతిలో ఘోర ప్రమాదం వీడియో ఇదిగో.. నిర్మాణ స్థలంలో క్రేన్, జేసీబీ కూలి సైట్ ఇంజనీర్ సహా ముగ్గురు మృతి..

ఆమె రక్తపు మడుగులో పడిపోవడంతో భయాందోళనకు గురైన చిన్నారావు, వెంటనే అక్కడి నుంచి సమీపంలోని ఒక భవనం పైకి పరుగెత్తాడు. అనంతరం ఆ భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అలర్ట్ అయిన స్థానికులు తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమెకు ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, క్లూస్ టీమ్ సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement