YSRCP Memantha Siddham CM Jagan Bus Yatra: ఉత్త‌రాంధ్ర‌లో ప్రవేశించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మేమంతా సిద్ధం బస్ యాత్ర..వైయ‌స్ జగన్‌కి స్వాగతం పలుకుతున్న వేలాది మంది ప్రజలు, అభిమానులు

ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతున్నారు.

jagan

మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించింది. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ జనం ముక్తకంఠంతో చెబుతున్నారు. బస్సు యాత్ర వైయ‌స్ఆర్‌ సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. జననేత కోసం జనం మండే సూరీడును సైతం లెక్క చేయడం చేయడం లేదు. దారి పొడవునా తీన్‌మార్‌లు, డప్పుల సందడితో ఎక్కడ చూసినా అభిమానులు సందడి చేస్తున్నారు. బస్సు యాత్ర జన ప్రవాహాన్ని తలపిస్తోంది.

19వ రోజు అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి సీఎం జగన్‌ను పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. వారి యోగక్షేమాలను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

కాగా, సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన గోడిచర్ల ప్రాంతం సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్య­వరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.9వ రోజు అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి సీఎం జగన్‌ను పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. వారి యోగక్షేమాలను సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

కాగా, సీఎం జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన గోడిచర్ల ప్రాంతం సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమైంది. నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చింతపాలెం వద్దకు సీఎం జగన్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బయ్య­వరం, కశింకోట, అనకాపల్లి బైపాస్, అసకపల్లి మీదుగా చిన్నయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.