Manda Krishna Madiga: 7న జరిగే లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమం వాయిదా, వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారని ఫైర్, దామోదర రాజీనామా చేయాలని డిమాండ్

ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడాం అన్నారు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ . వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారు అన్నారు. లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమానికి అనుమతి రాలేదు అన్నారు.

30-year struggle for SC categorisation says Manda Krishna Madiga(X)

Hyd, Feb 5:  ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడాం అన్నారు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga). మీడియాతో మాట్లాడిన మందకృష్ణ.. వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారు అన్నారు. లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమానికి అనుమతి రాలేదు అన్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఆపిందని.. 7 న జరిగే లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమం వాయిదా వేసుకున్నాం అన్నారు. తేదీ త్వరలో ప్రకటిస్తాం.. కానీ కార్యక్రమం మాత్రం తప్పకుండా నిర్వహిస్తాం అని తేల్చిచెప్పారు.

చాలా కమిషన్లు ఎస్సీ వర్గీకరణ(SC categorization)కు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి.. మాదిగల జనాభాకు తగ్గట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని విన్నవించాం అన్నారు. వర్గీకరణను మాలలు అడ్డుకుంటున్నారు.. న్యాయబద్ధంగా మాకు 11 శాతం వాటా రిజర్వేషన్లు రావాలన్నారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో మాకు 9 శాతమే దక్కుతుంది... 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం ఇచ్చారు అన్నారు. 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలి.. కమిషన్ సిఫార్సు చేసిన గ్రూపుల్లో కులాల కేటాయింపు సరిగ్గా లేదు అన్నారు. మాదిగల ప్రాతినిధ్యం పెరుగొద్దు.. మాలలు ప్రాతినిధ్యం పెరిగేలా ఉందన్నారు.  మల్లన్న గెలుపు కోసం చాలా కష్టపడ్డాం.. ఇప్పుడు బాధ పడుతున్నాం మంత్రి సీతక్క, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా అన్నది డిసైడ్ చేసుకోవాలని ఫైర్ 

మంత్రిగా దామోదర రాజనర్సింహ(Damodhara Rajanarsimha) ఫైయిల్ అయ్యారు అని...మాదిగలకు రావాల్సిన వాటా తీసుకోలేదు అన్నారు. దామోదర రాజనర్సింహ ను మంత్రిగా మేము చూడటం లేదు.. దామోదర ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్పాలన్నారు. నవ్వు ఎవరి ప్రతినిధి వో తేల్చుకో..నీ మౌనం,.. నీ చేతగాని తనం మాదిగలు క్షమించరు అన్నారు.

దామోదర మంత్రి వర్గం నుంచి తప్పుకో.. దామోదర ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మరో ఇద్దరు మాదిగాలను మంత్రి వర్గంలో తీసుకోవాలి.. మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డికి తెలుసు అన్నారు మందకృష్ణ.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement