Teegala Krishna Reddy's grandson dies in a horrific road accident in Hyderabad

Hyderabad, Mar 8: టీకేఆర్ (TKR) విద్యాసంస్థల అధినేత, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ నగర శివార్లలోని గొల్లపల్లి కలాన్ వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై కనిష్క్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్పీడ్ గా వచ్చిన కారు లారీని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తొంది. తీవ్ర గాయాలపాలైన కనిష్క్ రెడ్డిని అటుగా వెళుతున్న వారు ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించి కనిష్క్ రెడ్డి మృతి చెందాడు. కనిష్క్ రెడ్డి మరణంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కనిష్క్ రెడ్డి తల్లి తీగల సునరిత రెడ్డి మూసారాం బాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గా ఉన్నారు.

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?

తీగల ఇంట విషాదం

టీకేఆర్ విద్యాసంస్థల ఛైర్మన్‌ గా ఉన్న తీగల కృష్ణారెడ్డి.. తొలుత తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పిలుపు మేరకు చేరారు. ఆ తర్వాత హైదరాబాద్ కు మేయర్ గా కూడా పనిచేశారు. అదే విధంగా.. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తీగల.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం చోటు చేసుకొవడంతో పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

లక్షమందితో బీఆర్ఎస్‌ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన

అప్పుడు కోమటిరెడ్డి కుమారుడు కూడా

గతంలో కూడా పలువురు రాజకీయా నేతలు, సెలబ్రీటీల కుటుంబానికి చెందిన వాళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయిన విషయం తెలిసిందే.