Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలిపారు.

Telugu film industry meets Telangana CM (photo-X/Video grab)

Hyd, December 26:  టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలిపారు. అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది.. దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా అన్నారు.

తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయి...గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో చేశారు అన్నారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను.. హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం అన్నారు రాఘవేంద్రరావు.

యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలని... ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు నాగార్జున. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అన్నారు. ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్నారు నటుడు మురళీమోహన్‌. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని...సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల..ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం అన్నారు.

నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నాను అన్నారు శ్యాంప్రసాద్‌రెడ్డి. హైదరాబాద్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లాలన్నారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు దగ్గుబాటి సురేష్‌బాబు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ చేయాలనేది డ్రీమ్.. ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందన్నారు. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ సహా అన్ని ఏజెన్సీలకు.. హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉండాలన్నారు.  తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం. సంధ్య థియేటర్‌ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి... ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే.. తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందదని తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement