
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy Delhi Tour).
అలాగే హస్తిన పర్యటనలో భాగంగా ఇండియా టుడే కాంక్లేవ్ ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి(CM Revanth Reddy). కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్ ను కలవనున్నారు రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహోశ్ కుమార్ గౌడ్. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను నాలుగు కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. వీటిలో తమకు ఒకటి కావాలని సీపీఐ కోరుతుండగా మరో స్థానం మజ్లిస్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.