Harishrao: కాంగ్రెస్ పాలనలో రైతులు,ఆటో డ్రైవర్లే కాదు.. బిల్డర్లు ఆత్మహత్య, ప్రభుత్వ అసమర్థ విధానాలే ఆత్మహత్యలకు కారణమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
బిఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.., ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ (మేడ్చల్ జిల్లాలో) ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు
Hyd, Jan 31: బిఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.., ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ (మేడ్చల్ జిల్లాలో) ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు(Harishrao). గిరాకీ లేక రియల్టీ బేజార్... ఉరేసుకున్న బిల్డర్ పేరుతో ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీశ్ రావు.. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు(Builder Suicide) చేసుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణం అని దుయ్యబట్టారు. శాంతి భద్రత దిగజారడం,పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడం,అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేయడం(Hydra Demolitions),మూసి, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు కారణం అన్నారు. తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోవడం,భవన నిర్మాణ అనుమతులకు బలవంతపు వసూళ్లు చేయడం,కొత్త పెట్టుబడులు రాకపోవడం, ఇతర రాజకీయ, ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగంపై గడిచిన 14 నెలల కాంగ్రెస్ పాలనలో పెను ప్రభావాన్ని చూపాయి అని ఆరోపించారు.
Builder in Medchel District Dies by Suicide, Harishrao slams CM Revanth Reddy
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం(Hyderabad Real Estate) అంటే బిల్డర్లకు స్వర్గధామం ఇదంతా ఒకప్పుడు...ఇప్పుడు బిల్డర్లకు నరకకూపం అయ్యిందన్నారు. నేను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాను, రియల్ ఎస్టేట్ గురించి నాకు చెప్తారా? అని మీడియా సమావేశంలో దబాయించిన సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని చేజేతులా నాశనం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
తెలంగాణ అభివృద్ధికి ఇరుసుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేశారు. హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని.. ఇప్పటికైనా మేల్కోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ, తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)