CM Revanth Reddy: హర్యానాలో కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ను ఓడిస్తే.. మేము కేజ్రీవాల్‌ను ఢిల్లీలో ఓడించామన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేరళ మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌కు హాజరు

2035లోపు తెలంగాణ జీడీపీ వృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).కేరళలోని మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ ఇన్‌ కేరళ కార్యక్రమం(Mathrubhumi International Festival)లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy at the Mathrubhumi International Festival in Kerala(X)

Kerala, Feb 9:  2035లోపు తెలంగాణ జీడీపీ వృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).కేరళలోని మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ ఇన్‌ కేరళ కార్యక్రమం(Mathrubhumi International Festival)లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా 24 గంటల విద్యుత్, రూ.12000 రైతు భరోసాపై వివరించారు రేవంత్.

కేరళ మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌లో తెలంగాణ, హైదరాబాద్ స్థితిగతులను వివరించారు. పీవీ నర్సింహారావు(PV Narasimha Rao)కు కాంగ్రెస్ అన్యాయం చేసింది అనేది అబద్దం అన్నారు. కాంగ్రెస్ ఆయనకు చాలా చేసింది దానికి నేనే సాక్ష్యం.. వారి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉందన్నారు.

 సిరిసిల్లలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు నాలుగేళ్లు.. వైద్య బృందానికి అభినందనలు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్ 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు జైపాల్ రెడ్డి(Jaipal Reddy) లకు చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి చేసి సౌత్ రాష్ట్రాల నాయకులకు కాంగ్రెస్ మంచి అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ సరైన పద్ధతిలో చేయాలన్నారు. అలా చెయ్యకపోతే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.. సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు.

హర్యానాలో కాంగ్రెస్ పార్టీని కేజ్రివాల్ గెలికాడు.. అందుకే ఢిల్లీలో కేజ్రివాల్‌ను మేము గెలికాము.. చివరికి బీజేపీ గెలిచింది అని వెల్లడించారు. రైతుకూలీలకు రూ.12000 ఇచ్చామని తెలిపారు. రైతు భరోసా, రైతు భీమా పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement