CM Revanth Reddy on Job Calendar: అప్పులు ఉన్నా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను తప్పకుండా భర్తీ చేస్తాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల అందజేత

రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉ‍న్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy on Job Calendar) తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన 7,094 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు

Revanth Reddy (photo-X)

Hyd, Jan 31: రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉ‍న్నా.. ఆర్థిక భారమైన ఉద్యోగాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy on Job Calendar) తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణలో స్టాఫ్ నర్స్ పరిక్షల్లో ఉద్యోగం సాధించిన 7,094 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నియామక ప్రతాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను (We will Fill 2 lakh jobs in a year) తప్పకుండా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. గుడ్ న్యూస్, తెలంగాణలో ట్రాఫిక్‌ ఛలాన్ల రాయితీ గడువు ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగింపు, ఇంకా పెండింగ్‌లో లక్షల చలానాలు

టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామన్నారు. 15వేల పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితిని సమీక్షించి నియామకాలు త్వరగా జరిగేలా చూశారన్నారు. ఉద్యోగ నియామకం వేళ మీ సంతోషంలో భాగస్వాములం కావాలనుకున్నామన్నారు.

విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ ఏర్పడిందని... గడిచిన పదేళ్లలో రాష్ట్ర యువత ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ ప్రయోజనాలు ఆలోచించిందని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. కూతురును నిజామాబాద్ నుంచి ఓడిస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి మాత్రం ఆలోచించలేదన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అనుమతించే జీవో 47 రద్దు చేయాలని హైకోర్టులో పిల్, కోర్టు ఏం చెప్పిందంటే..

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగుల కలల సాకారం చేయటంలో ఇది తొలి అడుగని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తుచేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement