High Court of Telangana | (Photo-ANI)

Hyd, Jan 31: టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నాగోల్‌కు చెందిన హరీందర్ అనే వ్యక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనుమతించే జీవో 47 ను రద్దు చేయాలని కోర్టును కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉందని, ఈ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని హరీందర్ కోర్టును అభ్యర్థించారు.

అయితే ఈ పిటిషన్‌లో ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషన్ దాఖలు చేసే ముందు ఇబ్బందులు ఎదుర్కొన్నామని పిటిషనర్ వివరించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.

వీడియో ఇదిగో, పుల్లుగా తాగి టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్‌పై మహిళ దాడి, అసభ్యకర పదజాలంతో దూషణలు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది.బస్సులన్ని మహిళలతోనే నిండిపోతున్నాయని టికెట్‌ తీసుకున్నా సీటు ఉండటం లేదని పిటిషనర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని పిటీషన్‌లో పేర్కొన్నారు.కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపారు.