Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు.

Congress MLA Aadi Srinivas sensational comments on KTR(X)

Hyd, December 20:   తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు.

ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబట్టి అల్లర్లు, దాడులు, ధర్నాలు చేసేందుకు సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బు పంపించారు అని...కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కన్నేసి ఉంచాలన్నారు.  ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం...తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ, FIR కాపీతో పాటు నగదు బదిలీ వివరాలను అడిగిన ఈడీ 

కేటీఆర్ పై కేసు సక్రమమైన చర్యనే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ హయాంలో ప్రతి రంగంలోనూ అవినీతి జరిగిందని...అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను ఇంటికి పంపారు అన్నారు.

MLA Aadi Srinivas sensational comments on KTR

అధికారం కోల్పోయినా ఇంకా అదే అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు... కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పోవట్లేదు అన్నారు. అన్ని నిబంధనల మేరకే జరుగుతున్నాయని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

Advertisement
Advertisement
Share Now
Advertisement