Amit Shah Telangana Tour Cancelled: అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు, జేపీ నడ్డా సభ యథావిధిగా కొనసాగుతుందని తెలిపిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది.

Credits: Twitter/ANI

Hyd, June 13: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది. ఈ నెల 15న ఖమ్మంలో నిర్వహించనున్న అమిత్‌ షా భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపాలని బీజేపీ భావించింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, పార్టీ కమిటీల్లో మార్పులపై జరిగిన ప్రచారంతో కూడా కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. అమిత్‌ షా పర్యటన క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని నింపే అవకాశం ఉందని ఊహించారు. అయితే తాజాగా అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దవ్వడంతో కాషాయ పార్టీ శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి.

రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు, రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపిన సీఎం కేసీఆర్, నిమ్స్‌ దశాబ్ది బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన

ఖమ్మంలో రేపటి(గురువారం) బీజేపీ బహిరంగ సభను వాయిదాను వేసినట్టు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని పిలుపునిచ్చారు. అయితే, ఈనెల 25వ తేదీన నాగర్‌ కర్నూల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ యథావిధిగా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.

కాగా, నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ఖమ్మం బహిరంగ సభను వాయిదా వేశాం. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో బిపర్‌జాయ్‌ తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాల పర్యవేక్షణ బాధ్యతలు అమిత్‌ షాపై ఉన్నాయి. అందుకే సభను వాయిదా వేశాం. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో సభ వద్దనుకుని నిర్ణయం తీసుకున్నాం.

బీఆర్ఎస్ నేతల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు, మొత్తం 60 ప్రాంతాల్లో ఐటీ సోదాలు, రియల్‌ఎస్టేట్‌ కార్యాలయాల్లోనూ సోదాలు

త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించడం గ్యారెంటీ. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దు. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఎప్పుడు అనే అంశంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. బిపర్‌జాయ్‌ తుపాను కారణంగా దాదాపు 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పలు రైళ్లను కూడా రద్దు చేయడం జరిగిందన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement