Delhi Liquor Policy Case: కవిత అరెస్టుపై కీలక ప్రకటన చేసిన ఈడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు చెల్లించారని వెల్లడి, వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు తెలిపింది.

kavitha

Hyd, Mar 18: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌ (ఈడీ) ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు తెలిపింది.

ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఆ సమయంలో ఆమె బంధువులు, అనుచరులు మా విధులకు ఆటంకం కలిగించారు. ఆప్‌ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర పన్నారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. నా అరెస్ట్ చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత, మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్లు చెల్లించారు. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్‌, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశాం. మనీష్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, విజయ్‌ నాయర్‌తోపాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశాం. రూ. 128.79 కోట్ల నగదు సీజ్ చేశామని పేర్కొంది. కేసులో ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపిన ఈడీ.. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది

ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితకు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కవిత బీపీ సాధారణంగా ఉందన్న పేర్కొన్నారు. 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement