Delhi Liquor Scam Case: కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు, బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే వారానికి వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలకు ఆదేశాలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది.

Hyd, August 20: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి ఈ నెల 23 (శుక్రవారం) వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి, మార్చి 16న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement