DJHS Wishes to TS CM Revanth Reddy: నూతన ప్రభుత్వానికి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ శుభాకాంక్షలు.. జర్నలిస్టుల ఇంటి కల సాకారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన నూతన ప్రభుత్వానికి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి శుభాకాంక్షలు తెలిపారు. డీజేహెచ్ఎస్ విన్నపం మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలం అంశాన్ని పొందుపరిచిన సంగతి తెలిసిందే.

CM Revanth Reddy (photo-X)

Hyderabad, Dec 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన నూతన ప్రభుత్వానికి డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్-DJHS) అధ్యక్షులు బొల్లోజు రవి శుభాకాంక్షలు తెలిపారు. డీజేహెచ్ఎస్ విన్నపం మేరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలం అంశాన్ని పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బొల్లోజు రవి విజ్ఞప్తి చేశారు.

KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

'గతంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్సార్  ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు హైదరాబాదులో ఎవరికి ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశం ఒక కలగానే మిగిలిపోయింది. దీన్ని గుర్తించిన మేం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీగా ఏర్పడ్డాము. కాబట్టి కొత్త ప్రభుత్వం హైదరాబాద్ జర్నలిస్టుల ఇంటి స్థలం అంశాన్ని ప్రాధాన్యంగా గుర్తించి మొదటి మంత్రిమండలి సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకోవాల'ని ఆయన కోరారు.

Telangana Cabinet Meeting: వీడియోలు ఇవిగో, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్‌ భేటీ, ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన మంత్రి వర్గం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement