Ram Ke Naam: అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట ముందు హైదరాబాద్ లో కల్లోలం సృష్టించేందుకు యత్నం, వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించిన ముగ్గురిపై కేసు
రామ్ కే నామ్ (Ram Ke Naam) అనే నిషేదిక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు నేరేడ్ మెట్ పోలీసులు. సైనిక్ పురిలోకి ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో పోలీసుల (documentary) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
Hyderabad, JAN 021: రామ మందిరం ప్రారంభోత్సవం ముందు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. రామ్ కే నామ్ (Ram Ke Naam) అనే నిషేదిక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు నేరేడ్ మెట్ పోలీసులు. సైనిక్ పురిలోకి ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో పోలీసుల (documentary) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ డాక్యుమెంటరీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రామమందిరం ప్రారంభోత్సవం ముందు ఇలాంటి కవ్వింపు చర్యలకు దిగిన ముగ్గురు వ్యక్తులపై నేరేడ్ మెట్ పోలీసులు కేసు నమోదు (FIR registered) చేశారు. ముందస్తు పథకం ప్రకారం ఓ వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ఇలా డాక్యుమెంటరీని ప్రదర్శించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.