Formula-E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం...ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు, గ్రీన్ కో ఎండీకి సైతం నోటీసులిచ్చిన ఏసీబీ

ఫార్ములా - ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గ్రీన్ కో ఎండీ అనిల్ కు సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది.

Formula-E Race Case ACB Issues Notices to ACE NextGen(X)

ఫార్ములా - ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ACE NextGen కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గ్రీన్ కో ఎండీ అనిల్ కు సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసులోపేర్కొంది ఏసీబీ. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, BLN రెడ్డి లను విచారించారు ఏసీబీ అధికారులు.

ఇక ఇదే కేసులో ఇవాళ ఈడీ విచాణరకు హాజరయ్యారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గచ్చిబౌలిలోని తన నివాసం నుండి బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు కేటీఆర్.   ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనే అంశాలపై ఆరా తీయనుంది ఈడీ.వాస్తవానికి ఈడీ విచారణకు ఈ నెల 7న హాజరుకావాల్సి ఉంది కేటీఆర్.

Formula-E Race Case: ACB Issues Notices to ACE NextGen

అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement