CM Revanth Reddy On Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచన

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడిన సీఎం... ముఖ్యంగా మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాల‌ని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు.

heavy rains telangana cm revanth reddy key instructions to officials

Hyd, Sep 1: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడిన సీఎం... ముఖ్యంగా మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాల‌ని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు.

ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాల‌న్నారు. రిజ‌ర్వాయ‌ర్ల గేట్లు ఎత్తుతున్న క్రమంలో ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని సీఎం చెప్పారు.  వాన నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు.. ఏరుకుని సంచిలో వేసుకున్న స్థానికులు.. హైదరాబాద్ వైరల్ వీడియో 

Here's Tweet:

 భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు జితేంద‌ర్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, పోలీసు క‌మిష‌న‌ర్లు, కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టికప్పుడు స‌మీక్షిస్తూ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement