Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.

Gajwel Hit and Run Case (Credits: X)

Siddipet, Dec 8: సిద్ధిపేట (Siddipet) జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను పరంధాములు(43), పూస వేంకటేశ్వర్లు(42) గా పోలీసులు గుర్తించారు. పరంధాములు సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్‌ లో విధులు నిర్వహిస్తుండగా.. దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌ లో పూస వేంకటేశ్వర్లు కానిస్టేబుల్‌ గా పని చేస్తున్నారు. జాలిగామ బైపాస్ వద్ద వీరి బైక్‌ ను ఓ వాహనం బలంగా ఢీకొట్టంది. దీంతో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, అనుమానిత వాహనం, దాన్ని నిడిపింది ఎవరన్నదన్న వివరాలు తెలియాల్సి ఉంది.

మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా వినతి, రాజకీయాలు చర్చించలేదన్న పొన్నం 

Here's Video:

మారథాన్ లో పాల్గొనాల్సి ఉండటంతో..

మృతులు పరంధాములు,  పూస వేంకటేశ్వర్లు ఈసీఎల్‌ లో జరుగుతున్న మారథాన్ లో పాల్గొనాల్సి ఉంది. అక్కడ నిర్వహిస్తున్న  రన్నింగ్‌ లో వీళ్లు ఇద్దరూ  పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి..నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ పోరాటం గుర్తుకొస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యం అని మండిపాటు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement