RTC Bus Accident Video: వీడియో ఇదిగో.. ఆటోను తప్పించబోయి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం..

రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న బస్సు ఒక ఆటోను తప్పించబోయి నియంత్రణ కోల్పోయి నేరుగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది.

RTC Bus Accident Video:

RTC Bus Accident Video: రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న బస్సు ఒక ఆటోను తప్పించబోయి నియంత్రణ కోల్పోయి నేరుగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెట్రోల్ బంక్‌లో ఆగి ఉన్న రెండు కార్లు, ఒక ఆటో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బాటసింగారంలోని ఐఓసీ పెట్రోల్ బంక్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు బంక్‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఎనిమిది ఏళ్లుగా నడిపిన బస్సుకు లాస్ట్ కిస్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రైవర్ ఎమోషనల్ వీడ్కోలు.. వీడియో ఇదిగో..

దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుండి చౌటుప్పల్ వైపు వెళ్తుండగా బాటసింగారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగంగా ప్రయాణిస్తుండగా, అదే సమయంలో రోడ్డుపై ఆకస్మికంగా ఆటో రావడంతో బస్సు డ్రైవర్ దానిని తప్పించే క్రమంలో ఒక్కసారిగా స్టీరింగ్ తిప్పారు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది. బంక్‌లోని డీజిల్ పంప్ వరకు బస్సు దూసుకెళ్లడంతో అక్కడి రీడింగ్ యంత్రాలు, ఇతర పరికరాలు విరిగిపడ్డాయి.

RTC Bus Accident Video:

బస్సు పంప్‌ను బలంగా ఢీకొట్టినప్పటికీ, పెట్రోల్/డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బంక్ సిబ్బంది, అక్కడ ఉన్న వాహనదారులు ప్రాణాల చేతిలో పెట్టుకుని పారిపోవడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కానీ బస్సు బలంగా ఢీకొట్టడంతో బంక్ యంత్రాలు, బస్సు ముందు భాగం మరియు ధ్వంసమైన కార్లకు భారీ నష్టం వాటిల్లింది. బస్సు డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement