Sex Racket Busted in Hyd: హైదరాబాద్‌లో 14,190 మందితో అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌, వల వేసి పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు, 17 మంది అరెస్ట్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీసులు ( Cyberabad police) మరో సెక్స్‌ రాకెట్‌ ముఠాను పట్టుకున్నారు. ఈ క్రమంలో 17 మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది

Sex Racket Busted. (Photo Credit: PTI)

Hyd, Dec 6: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీసులు ( Cyberabad police) మరో సెక్స్‌ రాకెట్‌ ముఠాను పట్టుకున్నారు. ఈ క్రమంలో 17 మందిని అరెస్ట్‌ చేసి వారి నుంచి 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.వీరి నుంచి ఏపీ, తెలంగాణ, కర్నాటక, ముంబై, ఢిల్లీతో పాటుగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, థాయిలాండ్‌, రష్యా దేశాలకు చెందన బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, 17 మంది సభ్యులు హైదరాబాద్‌ వేదికగా అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ను (International Sex racket) నిర్వహిస్తున్నారు.

సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!

సమాచారం తెలుసుకున్న సైబరాబాదం పోలీసులు.. 39 కేసుల్లో 17 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, ఈ ముఠా పలు వెబ్‌సైట్లలో ఎస్కార్ట్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను, మహిళలను ఉపాధి పేరుతో తీసుకువచ్చి వారిని ఈ ముఠా వ్యభిచారం కూపంలోకి దింపుతోందని పోలీసులు వెల్లడించారు.

Share Now

Advertisement
Share Now
Advertisement