Hyderabad Horror: నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. హైదరాబాద్ లో ఘోరం

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్‌ తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.

Representative Image (Photo Credit- PTI)

Hyderabad, Oct 19: హైదరాబాద్ (Hyderabad) లో ఘోరం జరిగింది. నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్‌ (Blade) తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. యువతి అరవడంతో పెట్రోలింగ్‌ పోలీసులు కాపాడి చికిత్స కోసం దవాఖానకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పులి కాదు పిల్లి...మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచారం ఉత్తదే అని తేల్చిన అటవీ శాఖ అధికారులు...

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాళహస్తి సమీపంలోని చోడవరానికి చెందిన మధుసూదన్‌ రెడ్డి(22), అదే ప్రాంతానికి చెందిన యువతి(21) నెల్లూరు జిల్లాలోని ఓ కళాశాలలో ఇటీవల ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. అనంతరం నగరానికి వచ్చిన ఇద్దరూ.. అమీర్‌ పేటలోని ఓ సంస్థలో ఐటీ కోర్సులో శిక్షణ తీసుకుంటూ ఎస్‌ఆర్‌ నగర్‌ లోని వేర్వేరు హాస్టళ్లలో ఉంటున్నారు. ఇటీవల మద్యం, ఇతర వ్యసనాలకు బానిసకావడంతో మధుసూదన్‌రెడ్డిని యువతి దూరం పెడుతుంది. దీంతో ఆమెపై మధుసూదన్‌ కోపం పెంచుకున్నాడు.

కీసరగుట్టలో మహిళా అఘోరి, ఒంటి కాలిపై నిలబడి శివుడికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు

అలా కుట్ర

తనను దూరం పెడుతోన్న యువతిపై కోపం పెంచుకునన్ మధుసూదన్‌ ఆమెను చంపాలని కుట్రపన్నాడు. ఒక్కసారి మాట్లాడుతానంటూ హాస్టల్‌ నుంచి యువతిని బయటికి పిలిపించి మధుసూదన్‌ గొడవపడ్డాడు. ఇదే సమయంలో తన వద్ద ఉన్న బ్లేడ్‌ తో యువతి గొంతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement