Hyderabad Horror: మధురానగర్‌లో దారుణం, బట్టలు ఉతకాలంటూ మహిళను రూంకి తీసుకువెళ్లి కామాంధులు సామూహిక అత్యాచారం

ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Rape (Photo-Rep)

Hyd, Nov 5: హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్‌ పరిధిలో ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పని ముగించుకుని వస్తుండగా మాయమాటలు చెప్పి తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీం, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారించారు. అనంతరం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగానే బాలిక బట్టలు విప్పి అత్యాచారం చేయబోయిన కామాంధుడు, గుడి నుంచి బయటకు వచ్చిన చిన్నారిపై దారుణం

కామాంధులు తమ ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందని మహిళకు చెప్పారు. దీంతో బట్టలు ఉతికితే డబ్బులు వస్తాయని ఆశ పడిన మహిళ వారితో వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో ముగ్గురు వ్యక్తులు ఆటోలో మహిళను తీసుకుని మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాము ఉంటున్న రూంకు తీసుకువచ్చారు. ఆపై మహిళపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కామాంధుల అఘాయిత్యంతో మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో పక్కనే ఉన్న ఓ మహిళ రావడం చూసిన కామాంధులు అక్కడినుంచి పరార్ అయ్యారు.