Hyderabad Shocker: పాతబస్తీలో దారుణ హత్య, ఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ అల్లుడుని కిరాతకంగా నరికేసిన ఆరుగురు వ్యక్తులు, స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని అనుమానాలు

హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణ హత్య చోటుచేసుకుంది. లలిత్‌బాగ్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ అల్లుడు ముర్తుజా అనస్‌పై (Lalit Bagh MIM corporator’s son in law) గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. లలిత్‌బాగ్‌ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది.

Murder (Photo Credits: Pixabay)

Hyd, Dec 19: హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణ హత్య చోటుచేసుకుంది. లలిత్‌బాగ్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ ఆజం షరీఫ్‌ అల్లుడు ముర్తుజా అనస్‌పై (Lalit Bagh MIM corporator’s son in law) గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. లలిత్‌బాగ్‌ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌ కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అనస్‌ను ఉస్మానియా అసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు.

కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు కలిసి అనస్‌పై దాడి ( indiscriminately attacked and killed by thugs) చేసినట్లు పోలీసులు గుర్తించారు. కార్పొరేటర్‌ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఆరుగురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో అనస్ ఇంటర్‌ చదువుతున్నాడు. స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement