Marriage Conflict: భార్యపై కోపంతో దారుణం,అత్త మామల కుటుంబంపై లండన్ నుండి విష ప్రయోగం చేసిన అల్లుడు, అత్త మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైదరాబాద్లోని మియాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆమె కుటుంబ సభ్యులపై పగను పెంచుకున్న ఓ భర్త ( husband )ఏకంగా ఆ కుటుంబాన్ని అంతం చేయడానికి విష ప్రయోగం చేశాడు.
August 22: హైదరాబాద్లోని మియాపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆమె కుటుంబ సభ్యులపై పగను పెంచుకున్న ఓ భర్త ( husband )ఏకంగా ఆ కుటుంబాన్ని అంతం చేయడానికి విష ప్రయోగం చేశాడు.ముందు అత్తను చంపేసి ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల అవయవాలు పనిచేయకుండా చేశాడు.షాకింగ్ కర విషయం ఏంటంటే.. ఈ తతంగాన్ని అతను యుకేలోని లండన్ లో ఉండి నడిపించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ లో హనుమంతరావు, ఉమామహేశ్వరి( Hanumantha Rao, Umamaheswari ) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. జులై 5న ఉమామహేశ్వరి అకస్మాత్తుగా మరణించింది.అందరూ కూడా ఆమె అనారోగ్యం కారణంగా మృతి చెందిందని భావించారు. అయితే హనుమంతరావు తో పాటు ఆయన ముగ్గురు పిల్లల కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయాయి.
భయపడిన కుటుంబ సభ్యులందరూ వైద్య పరీక్షలు( Medical tests ) వైద్యుని దగ్గరకు వెళ్లారు. అక్కడ వారికి షాకింగ్ విషయాలు తెలిసాయి. శరీరంలో విష ప్రయోగం జరగడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు.వెంటనే హనుమంతరావు కుమార్తె డాక్టర్ శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే అల్లుడు అజిత్ కుమార్( Ajith Kumar ) ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది.
హనుమంతరావు కుమార్తె శిరీష కు, అజిత్ కుమార్ అనే ఫార్మసిస్ట్‌కు 2018 లో వివాహం అయింది. ఈ దంపతులు ఉద్యోగరీత్యా లండన్లో స్థిరపడ్డారు.ఈ దంపతులకు ఒక కుమార్తె సంతానం. అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో డాక్టర్ శిరీష లండన్ లోని పోలీసులకు ఫిర్యాదు చేసింది.అప్పటినుండి ఈ దంపతులు వేరుగా ఉంటున్నారు.
అజిత్ తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కోపం పెంచుకుని వారందరినీ చంపేయాలని అనుకున్నాడు.తన వద్ద పనిచేసే వినోద్ కుమార్, హైదరాబాదులో ఉన్న స్నేహితులు భవాని శంకర్, అశోక్, గోపీనాథ్, పూర్ణచంద్రరావు లతో కలిసి కుట్ర పన్నాడు.అదే సమయంలో సోదరుడి వివాహం కోసం లండన్ నుండి శిరీష హైదరాబాద్ వచ్చింది.ఆమె కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు గోకుల్ ప్లాట్స్ వాచ్మెన్ కుమారుడైన రమేష్ కు కొంత నగదును ఇచ్చాడు.
పసుపు, కారం లాంటి శాంపిల్ ప్యాకెట్లలో గుర్తు తెలియని విషం కలిపి డెలవరీ బాయ్ సాయంతో ఇంటికి పంపించాడు.వాటిని వినియోగించిన హనుమంతరావు కుటుంబంలో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. జులై 5న ఉమామహేశ్వరి మృతి చెందిన తర్వాత శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా పెట్టారు.సీసీటీవీ రికార్డులను పరిశీలించగా వాచ్ మెన్ కుమారుడైన రమేష్ వ్యవహార శైలిపై అనుమానంతో విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సదరు వ్యక్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద హత్య, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసు నమోదు చేసి అతని స్నేహితులు, అతని భార్య బంధువు సహా ఆరుగురిని ఆగస్టులో అరెస్టు చేశారు. 18 మంది ఫార్మాసిస్ట్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఫిర్యాదుదారుని వివాహం 2018లో ఫార్మసిస్ట్‌తో నిశ్చయించబడిందని, వారిద్దరికీ ఇది రెండో పెళ్లి అని పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Aug 22, 2023 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

