Hyderabad Shocker: గచ్చిబౌలిలో దారుణం, మహిళను కనస్ట్రక్షన్ బిల్డింగ్‌లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్, అనంతరం బండరాయితో కొట్టి చంపిన కామాంధులు

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు

Assault (Image used for representational purpose only) (Photo Credits: ANI)

Hyd, August 29: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. దారుణానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు. మృతురాలిని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళ (38)గా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

బాధితురాలు వేస్ట్ మెటీరియల్‌ను తీసుకునేందుకు నిర్మాణ సంస్థలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను బంధించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థలో నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు లేకుండా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం, హస్టల్ గదిలో బాలుడిపై ప్యూన్ అత్యాచారం, నొప్పి అని ఏడుస్తున్నా అరవకుండా నోరు కప్పి పని కానిచ్చిన కామాంధుడు

గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీలను ఆదేశించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement