Techie Commits Suicide: భర్త, అత్తమామల వేధింపులు, ఫేస్‌బుక్ లైవ్ పెట్టి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, నాచారంలో విషాదకర ఘటన
ఈ ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో చోటుచేసుకుంది. గత 5 నెలల నుంచి భార్య సనను భర్త హేమంత్ వేధిస్తున్నాడు.
Hyd, June 23: భర్త, అత్తమామల వేధింపులు తాళలేక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో చోటుచేసుకుంది. గత 5 నెలల నుంచి భార్య సనను భర్త హేమంత్ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తీవ్ర మనస్తాపానికి గురైన సన.. ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సనా అనే మహిళ.. హేమంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమెను అత్తమామలు తరచూ వేధించడం మొదలు పెట్టారు. అది చాలదన్నట్టు భర్త హేమంత్ సైతం మరో అమ్మాయికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే సనాకు భర్త నుంచి కూడా వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. 5 నెలల నుంచి వేధింపులు భరించి భరించి విసుగు చెందిన సన ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు.