Flyover Slabs Collapsed in LB Nagar: ఎల్బీ నగర్ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల్లో ప్రమాదం, కుప్పకూలిన పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్‌, తొమ్మిది మందికి గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లో నిన్న అర్ధరాత్రి కొంత భాగం కూలిన ఘటనలో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Flyover Collapsed in LB Nagar (Photo-Video Grab)

Hyd, June 21: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లో నిన్న అర్ధరాత్రి కొంత భాగం కూలిన ఘటనలో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయి. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బైరామల్ గూడా వైపు నుంచి ఫ్లై ఓవర్ పైకి వెహికిల్స్ ఎక్కే ర్యాంప్ కుప్పకూలింది. పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్‌ ఏర్పాటు చేస్తుండగా అది ఒక్కసారిగా కూలిపోయింది.

రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కూలడంతో దానిపై పనులు చేస్తున్న కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలుస్తోంది.ఘటనాస్థలానికి ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేజర్‌ ప్రాజెక్టు అధికారులు చేరుకుని పరిశీలించారు. పొక్లెయిన్‌ సాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement