Investments to Telangana: బంపర్ ఆఫర్ కొట్టిన తెలంగాణ, రూ.24వేల కోట్లతో హైదరాబాద్‌లో పరిశ్రమ పెట్టనున్న అమోలెడ్, భారత్‌లోనే తొలి సంస్థ తెలంగాణలోనే ఏర్పాటు, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు

రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (Rajesh Exports) భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ (KTR) ఆదివారం ప్రకటించారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్ల డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ భారత్‌లో అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు

Bangalore, June 13: తెలంగాణకు పెట్టుబడులు (Investments) వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (Rajesh Exports) భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ (KTR) ఆదివారం ప్రకటించారు. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్ల డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ భారత్‌లో అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ (ఎలెస్ట్‌) అమోలెడ్ డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్‌ (AMOLED display FAB) తయారీ యూనిట్‌ను తెలంగాణలో (Telengana) స్థాపించనుందని కేటీఆర్‌ తెలిపారు.

ఇందుకు రూ.24వేలకోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అత్యాధునిక అమోలెడ్ స్క్రీన్‌లను (AMOLED display) తయారు చేస్తోంది. ఇప్పటి వరకు జపాన్‌, కొరియా, తైవాన్‌ (Taiwan) దేశాలకు సాధ్యమైన అరుదైన ఫీట్‌ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోబోతుందని పేర్కొన్నారు.

Schools Reopen: తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై కీలక ప్రకటన సెలవులు పొడిగించే యోచన లేదు! సోమవారం నుంచే స్కూళ్లు తెరుస్తామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటన 

ఈ పరిశ్రమ రాకతో టీవీలు, ట్యాబ్స్‌, స్మార్ట్‌ఫోన్ల తయారీకీ అవసరమైన ఎకో సిస్టమ్‌ తెలంగాణలోనే తయారవుతుందని, తెలంగాణకు ఈ రోజు చారిత్రాకమైన రోజని కేటీఆర్‌ అభివర్ణించారు. ఈ మేరకు రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌తో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందంపై బెంగళూరులో సంతకాలు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement