School Student (Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, June 11: తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య (Covid Cases) పెరుగుతున్న క్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha indra reddy) కీలక ప్రకటన చేశారు. జూన్ 13 సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్ధలను తెరవనున్నట్లు స్పష్టం చేశారు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయని…. వేసవి సెలవుల్లో ఎలాంటి పొడిగింపు లేదని ఆమె స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా (Corona) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. అయితే.. దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Andhra Pradesh: లోకేష్‌ పుట్టుకతో వచ్చిన సమస్యతో ఇలా తయారయ్యాడు, మండిపడిన విజయసాయి రెడ్డి, లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్‌తో అంటూ అయ్యన్న కౌంటర్  

ఈ నేపథ్యంలో, తాజా విద్యాసంవత్సరంలో తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి (Schools Reopen) ఉండగా.. కరోనా కేసులు పెరిగుతున్న నేపథ్యంలో సెలవులను పొడగిస్తారనే వార్తలు వెలువడ్డాయి.

Corona Update: భారత్‌లో ఫోర్త్ వేవ్, 8 వేల మార్క్ దాటిన కేసులు, కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్న కేంద్రం 

అయితే, కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు ప్రకటించిన విధంగానే ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే పాఠశాలల పునః ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి ముందుకు కరోనా పరిస్థితులను తీసుకెళ్లారు.