Delta Covid-19 Variant Representative Image

భారత్ లో కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తాజాగా భారత్ లో 8,329 కరోనా కేసులు నమోదయ్యాయి. పది మంది కరోనా కారణంగా మరణించారు. అయితే శుక్రవారం 4,216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.

ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ మూడు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత్ లో ఇప్పటి వరకూ 4,32,06,195 మంది కరోనా బారిన పడ్డారు. 5,24,757 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 40,370గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,26,48,308 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో 1,94,92,71,111 వ్యాక్సినేషన్ డోసులు వేశారు.