Komatireddy Rajagopal Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ఏ పదవి ఇచ్చినా పనిచేస్తా..
కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుందనుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ పదవి ఇచ్చినా (TPCC) సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Hyderabad, June 14: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుందనుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ పదవి ఇచ్చినా (TPCC) సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్సిపాలిటీ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పారు. స్థలం ఉండి కట్టుకునే వారికి ర.5 లక్షలు ఇస్తామని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్సిపాలిటీ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పారు. స్థలం ఉండి కట్టుకునే వారికి ర.5 లక్షలు ఇస్తామని తెలిపారు.