Lover Commits Suicide: ప్రియురాలు సమాధి వద్దే ప్రియుడు ఆత్మహత్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో విషాద ఘటన

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ( jayashankar bhupally) విషాద ఘటన చోటు చేసుకుంది. తను ప్రాణ పదంగా ప్రేమించిన యువతి చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు ఆమో సమాధి వద్దే తన ప్రాణాన్ని (Lover Commits Suicide) వదిలాడు. నిజమైన ప్రేమకు అద్దం పట్టేలా జరిగిన ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Hyderabad, Oct 25: తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ( jayashankar bhupally) విషాద ఘటన చోటు చేసుకుంది. తను ప్రాణ పదంగా ప్రేమించిన యువతి చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేని ప్రియుడు ఆమో సమాధి వద్దే తన ప్రాణాన్ని (Lover Commits Suicide) వదిలాడు. నిజమైన ప్రేమకు అద్దం పట్టేలా జరిగిన ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో ఇద్దరు యువ‌తీయువ‌కులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేకపోయారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనకున్నారు. ఇంతలోనే ప్రియురాలు అనారోగ్యంతో కన్నుమూసింది.

ఆగని గ్యాంగ్ రేప్‌లు, మెట్‌పల్లిలో బాలికపై ఐదుమంది అత్యాచారం, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు

తన ప్రాణంలాంటి ప్రియురాలే లేని ఈ లోకంలో ఇక తాను భూమి మీద బతకడం ఎందుకని భావించిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం నాడు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లిన మహేష్ ఉరేసుకున్నాడు. ఈ ఘటనలతో ఇరు కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఈ ఇరువురి మరణంతో ఆ రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement