Harish Rao Arrest: పోలీసుల‌తో తోపులాట‌లో మాజీ మంత్రి హ‌రీష్ రావు చేతికి గాయం, సైబ‌రాబాద్ సీపీ ఆఫీస్ ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌, మాజీ మంత్రులు హ‌రీష్ రావు, వేముల‌, గంగుల స‌హా పలువురు నేత‌లు అరెస్ట్

సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్టు(BRS Leaders Arrest) చేశారు. హరీశ్‌రావు (Harish Rao), వేముల ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy), పల్లా రాజేశ్వర్‌రెడ్డితో (Palla Rajeswar Reddy) పాటు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని

Harish Rao Arrest

Cyberabad, SEP 12: శంషాబాద్‌ పీఎస్‌కు తరలిస్తున్నారు. అయితే, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై బీఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం తెలిపారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ (BRS) డిమాండ్‌ చేశారు. అరెస్టు చేయకపోతే కోర్టు వెళ్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టులకు దిగారు. బీఆర్‌ఎస్‌ నేతలను ఈడ్చుకుంటూ వాహనాల్లో పడేశారు. ఈ క్రమంలో హరీశ్‌రావును పోలీసులు లాక్కువెళ్లేందుకు ప్రయత్నించగా హరీశ్‌రావు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తున్నది.

Here's Harish Rao Arrest Video

 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నివాసంపై ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, కాంగ్రెస్‌ కార్యక్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. కౌశిక్‌రెడ్డి ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి వచ్చిన గాంధీని పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

MLA Arekapudi Gandhi: కౌశిక్ రెడ్డిది మనిషి జన్మేనా..ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్ 

అయితే, దాడిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ సీపీ ఆఫీస్‌ వద్ద ఆందోళనకు దిగింది. కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్

Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్‌ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement