Mohan Babu: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా

ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి విదితమే. ఈ వివాదంలో జరిగిన ఘటనలపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

attempt murder case registered against Mohan Babu(X)

Hyd, Jan 6: ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి విదితమే. ఈ వివాదంలో జరిగిన ఘటనలపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. అయితే మోహన్ తరపున వాదించే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి అందుబాటులో లేకపోవడంతో విచారణపై పాస్ ఓవర్ కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. దీంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు, ఆయన తిరుపతిలో ఉన్నట్లు తెలిపిన న్యాయవాది

ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొంది. హైదరాబాద్ జల్ల పల్లిలో తండ్రి మోహన్ బాబు ఆస్తుల కోసం తనయులు మంచు విష్ణు(Manchu Vishnu), మనోజ్(Manoj) మధ్య పెద్ద పంచాయతీనే జరిగింది. మోహన్ బాబు నివాసానికి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నం చేశారు. దీంతో మనోజ్‌ను మంచు విష్ణు అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ జరిగింది. ఈ వివాదంపై న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో మంచు మోహన్ బాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement