Hyderabad Horror: వీరోచిత తల్లీకూతుళ్లకు సలాం.. తుపాకీతో తెగబడిన దొంగలు.. ఇంట్లోకి చొరబడి బెదిరింపులు.. భయపడకుండా తిరగబడ్డ తల్లీకూతుళ్లు.. తుపాకీ లాక్కొని తరమికొట్టిన వైనం... బేగంపేటలో అరుదైన ఘటన.. వీడియో వైరల్

బెదిరించిన వాళ్లకు తమ వద్ద ఉన్నది ఉన్నట్టు ఇచ్చి పంపుతారు. కానీ హైదరాబాద్ లోని బేగంపేటలో నివాసం ఉంటున్న తల్లీ కూతుళ్లు ఇద్దరు దుండగులను ఎదిరించి వారిని తరిమికొట్టిన ఘటన ఆశ్చర్యపర్చింది.

Hyderabad theft (Credits: X)

Hyderabad, Mar 22: సాధారణంగా తుపాకీ చూస్తే ఎంతటి వాళ్లైనా భయపడతారు. బెదిరించిన వాళ్లకు తమ వద్ద ఉన్నది ఉన్నట్టు ఇచ్చి పంపుతారు. కానీ హైదరాబాద్ (Hyderabad) లోని బేగంపేటలో నివాసం ఉంటున్న తల్లీ కూతుళ్లు (Mother and Daughter) ఇద్దరు దుండగులను ఎదిరించి వారిని తరిమికొట్టిన ఘటన ఆశ్చర్యపర్చింది. సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. ఆ తల్లికూతుళ్ల ధైర్యసాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సలాం అంటూ పోస్టులు పెడుతున్నారు.

Breaking News, ED arrested CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్‌. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ చేసిన ఈడీ...ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ..

అసలేమైంది?

బేగంపేటలో తల్లీకూతుళ్లు ఇద్దరూ నివసిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వారి ఇంట్లోకి ఇద్దరు దుండగులు తలకు హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత బ్యాగులోని తుపాకీని తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఒక్కసారిగా తల్లీకూతుళ్లు ఇద్దరు షాక్‌ కు గురయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకొని అదును చూసి నిందితుల నుంచి తుపాకీ లాక్కొని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడు దాడి చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి నిలిచారు. ఆ తర్వాత నిందితులు తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు దుండగులు యూపీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

Delhi Excise Policy Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇంటి వద్ద హైటెన్షన్‌, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్, ఆప్ అధినేత సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif