ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు. సుమారు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈడీ తనిఖీల నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఇంటి వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించారు. సీఎం ఇంటి వద్దకు ఢిల్లీ నార్త్‌​ జోన్‌ డీసీపీ చేరుకున్నారు.ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. కేజ్రీవాల్ వాడుతున్న సెల్ ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

క్షణంలోనైనా కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆప్‌ మంత్రులు ఒక్కొక్కరూ కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకుంటున్నారు. కాగా కవితను అరెస్ట్‌ చేసిన ఈడీ బృందమే కేజ్రీవాల్‌ ఇంట్లోనూ సోదాలు జరుపుతోంది. మరోవైపు ఈడీ సోదాలపై కేజ్రీవాల్‌ లీగట్‌ టీం అటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)