Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీ ముకుంద్, అతని కొడుకు
ఆమె బాత్రూంలో స్నానం చేస్తుడంగా.. సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఇంట్లో పని చేసే యువతిపై యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తుడంగా.. సీక్రెట్‌గా ఫోటోలు, వీడియోలు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తల్లి సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. ఓ యువతి (22) ఇంటి పని చేసేందుకు ఓ ఏజెన్సీలో పేరు నమోదు చేసుకుంది. సదరు ఏజెన్సీ జూన్ 18న ఆమెను బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12 మిథులానగర్‌లో నివాసముండే జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీ ముకుంద్ ఇంట్లో పనికి పంపించారు. అయితే యువతిపై మురళీ ముకుంద్ కన్నేశాడు.
జూలై 16న యువతికి తన బెడ్రూంలో బెడ్‌షీట్ మడత పెట్టాలని చెప్పి లోపలికి పంపించాడు. అనంతరం అతను లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టాడు. ఆ తర్వాత స్నానంచేసి రావాలని ఆమెను బెదిరించాడు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు.
జరిగిన విషయం ఎవరికైనా చెబితే నీతో పాటు నీ తల్లిని కూడా చంపేస్తానని ఆమెను బెదిరించాడు. రెండు రోజుల తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని కుమారుడు ఆకాష్‌కు చెప్పగా.. అతను బాధితురాలిని తీవ్రంగా కొట్టి బెదిరించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేయడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లి సహాయంతో ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు.. మురళీ ముకుంద్, అతని కుమారుడు ఆకాష్‌లపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు