New Bar Licences in Telangana: మందుబాబులుకు పండగే పండగ.. తెలంగాణలో కొత్తగా 41 బార్లు వచ్చేస్తున్నాయి..ఎక్కడెక్కడ అంటే..
తెలంగాణలో మద్యం ప్రియులు, వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 41 ‘2బీ’ (2B) బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అనుమతినిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
New Bar Licences in Telangana : తెలంగాణలో మద్యం ప్రియులు, వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 41 ‘2బీ’ (2B) బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అనుమతినిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పెరిగిన జనాభా, కొత్త మున్సిపాలిటీల ఆవిర్భావం, పరిసర గ్రామాల విలీనం ఆధారంగా ఈ కొత్త లైసెన్సులను కేటాయించారు.
ఈ 41 బార్లలో 14 తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలో (గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి) ఉండగా.. మిగిలిన 27 బార్లను రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్నారు. సజ్జనార్ డ్యాన్స్ వీడియో ఇదిగో.. ది ప్యారడైజ్ సినిమాలోని ఆయా షేర్ పాటకు చిందేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్
ముఖ్యమైన తేదీలు & దరఖాస్తు విధానం:
-
దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 28
-
చివరి తేదీ: అక్టోబర్ 12 (సాయంత్రం 5:00 గంటల వరకు)
-
నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు: రూ. 1 లక్ష
-
లాటరీ నిర్వహణ: అక్టోబర్ 16 (ఉదయం 11:00 గంటలకు)
బార్ ఎక్సైజ్ టాక్స్ (BET) & ప్రభుత్వ ఆదాయం:
ప్రాంతాల వారీగా వార్షిక ఎక్సైజ్ పన్నును ప్రభుత్వం కింద పేర్కొన్న విధంగా ఖరారు చేసింది:
| ప్రాంతం / మున్సిపాలిటీ | వార్షిక ఎక్సైజ్ టాక్స్ (BET) |
| TCUR పరిధి (హైదరాబాద్, సైబరాబాద్ మొదలైనవి) | రూ. 44 లక్షలు |
| బోధన్ (నిజామాబాద్ జిల్లా) | రూ. 42 లక్షలు |
| ఇతర నోటిఫైడ్ ప్రాంతాలు/మున్సిపాలిటీలు | రూ. 30 లక్షలు |
ఈ 41 కొత్త బార్ల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ. 14.62 కోట్ల అదనపు బార్ ఎక్సైజ్ ఆదాయం సమకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తొలిసారిగా 2బీ బార్లు అందుబాటులోకి రానున్న ప్రాంతాలు:
కొన్ని మున్సిపాలిటీలు మరియు గ్రామీణ పరిసర ప్రాంతాలలో తొలిసారిగా '2బీ' బార్ లైసెన్సులకు అవకాశం కల్పించారు.
-
తొలిసారి అనుమతి పొందిన ప్రాంతాలు: దేవరకద్ర, ఎల్లంపల్లి, మద్దూర్, గుమ్మడిదల.
-
ఇతర ప్రధాన ప్రాంతాలు: చేవెళ్ల, మొయినాబాద్, కొడంగల్, పరిగి, ములుగు, మక్తల్, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్, కేసముద్రం, అశ్వారావుపేట, కల్లూరు, కోహిర్, బిచ్కుంద మొదలైనవి.
ముఖ్య గమనిక:
లాటరీలో బార్ లైసెన్స్ దక్కించుకున్న తర్వాత దరఖాస్తుదారుడు లైసెన్స్ తీసుకోవడానికి నిరాకరించినా, వదులుకున్నా లేదా నిబంధనలను ఉల్లంఘించినా రూ. 5 లక్షల ఫైన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1,185 బార్లు పనిచేస్తుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే 657 బార్లు ఉన్నాయి. తాజా నోటిఫికేషన్‌తో రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు బార్ల పరిధి విస్తరించనుంది.
Tags
Telangana new bars
41 new bars Telangana
Telangana bar licences
2B bar licence
Telangana Excise Department
new bar licence applications
bar licence application fee
September 28 applications
October 12 deadline
Telangana bars
Hyderabad new bars
Telangana excise news
41 కొత్త బార్లు
2B బార్ లైసెన్స్
తెలంగాణ ఎక్సైజ్ శాఖ
కొత్త బార్ లైసెన్సులు
అక్టోబర్ 12 చివరి తేదీ
బార్ లైసెన్స్ ఫీజు
హైదరాబాద్ బార్లు
తెలంగాణ వార్తలు
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement