Droupadi Murmu Telangana Tour: తెలంగాణ‌లో రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న ఖరారు, మ‌హిళావ‌ర్సిటీతో పాటూ ప‌లు ప్రాంతాల్లో టూర్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (Telangana Women University) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడపనున్నారు

Droupadi Murmu. (Credits: ANI)

Hyderabad, DEC 11: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (Telangana Women University) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడపనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. రాష్ట్రపతి 17న ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు (AP) చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో జరిగే మొదటి కాన్వకేషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 20న సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ను సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, అలజడిగా మారిన సముద్రం, అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం 

గవర్నర్‌, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 21వ తేదీన ఉదయం 11 గంటలకు కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుని శ‌తాబ్ది వేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు. కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement