Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంలో విచారణ, ఇంకెంతకాలం గడువు కావాలని స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీం కోర్టు..తదుపరి విచారణ వాయిదా

సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరిగింది. తమ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయింపుల(defected MLAs) పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బిఆర్ఎస్( brs petition).

Supreme Court on disqualification of defected MLAs

Hyd, Jan 31:  సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరిగింది. తమ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయింపుల(defected MLAs) పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బిఆర్ఎస్( brs petition). బిఆర్ఎస్ పిటిషన్ పై విచారణ జరిపారు జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్. ముగ్గురు ఎమ్మెల్యేల పై సుప్రీం కోర్టులో SLP వేసింది బిఆర్ఎస్(BRS).

దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. వాళ్లపై చర్యలకు(disqualification) టైం ఫ్రేం పెట్టాలని సుప్రీం ను ఆశ్రయించింది బిఆర్ఎస్. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశించింది హైకోర్ట్ డివిజన్ బెంచ్. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది బిఆర్ఎస్.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం పార్టీ ఫిరాయింపుల పై బిఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి...మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ? అని ప్రశ్నించింది కోర్టు. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా ? అని తెలంగాణ స్పీకర్ ను అడిగింది సుప్రీం కోర్టు.  తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే

స్పీకర్ను అడిగి నిర్ణయం చెపుతామన్నారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు అన్నారు.

కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు .. హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది అన్నారు. రీజనబుల్ టైం అంటే ఎంత సమయం కచ్చితంగా టైం ఫ్రేమ్ ఉండాలిన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement